దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలతో.. ప్రతీ పేద కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా మారారని ఎమ్మెల్యే గాదరి కిశోర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఆయన నివాసంలో.. 34 మంది లబ్ధిదారులకు... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
కేసీఆర్ సర్కారంటే... పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడి ఇంట కష్టమొచ్చినా... తన పథకాలతో సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ తదితరులు పాల్గొన్నారు.