ETV Bharat / state

వలస కూలీలకు అన్నదానం - మున్సిపల్​ ఛైర్​పర్సన్​ అన్నపూర్ణ

లాక్​డౌన్ నేపథ్యంలో తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు రహదారుల వెంట నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్​ ఛైర్​పర్సన్​ అన్నపూర్ణ కూలీలతో కలిసి భోజనం చేశారు.

Meal arrangements for migrant labourers in Suryapet
వలస కూలీలకు అన్నదానం
author img

By

Published : May 18, 2020, 5:15 PM IST

లాక్​డౌన్ నిబంధనలతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు రోడ్డుబాట పట్టారు. నిత్యం వందలాది మంది వలస కూలీలు సూర్యాపేట మీదుగా అర్థాకలితో వెళ్తుంటారు. అలాంటి వారికోసం పట్టణంలో మున్సిపల్​ అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ముప్పై వేల రూపాయలతో సుమారు 500 మంది కూలీలకు అన్నదానం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లాక్​డౌన్​ ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ అన్నపూర్ణ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.