తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేలు అన్నారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని గిడ్డంగులను సోమవారం ఆయన సందర్శించి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
రాష్ట్రంలో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దాచుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం జయప్రకాష్ రెడ్డి, మేనేజర్ అశోక్ కుమార్, సర్పించి తీగల కరుణశ్రీ, సిబ్బంది యాదగిరి, రవికుమార్, తీగల మల్లారెడ్డి, బందం వెంకట్ రెడ్డి, చురకంటి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా విషయంలో హైకోర్టు ఏదడిగినా ఇవ్వండి: కేసీఆర్