సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చింతలపాలెం మండలంలో అన్ని గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చినట్లు తహసీల్దార్ కమలాకర్ వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నాలుగుసార్లు భూమి కంపించినట్లు వివరించారు. భూకంపలేఖినిపై తీవ్రత 3గా నమోదు అయినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. గతంలో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ అంశంపై అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
ఇవీ చూడండి: తెలంగాణ వార్షిక వృద్ధిరేటు 8.2 శాతం.. నివేదిక విడుదల చేసిన కేటీఆర్