KTR Fires on Congress in Suryapet District : సూర్యాపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సూర్యాపేటలో ఐటీ టవర్ ప్రారంభించిన ఆయన.. లబ్ధిదారులకు దళితబంధు చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా జగదీశ్‌రెడ్డి విజయం ఆపలేరని కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఐదేళ్ల క్రితమే వైద్య కళాశాల పూర్తి చేసినట్లు గుర్తు చేశారు.
KTR Suryapet District Tour : కేసీఆర్ హయాంలో కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధే అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేసిన అభివద్ధి ఏమీ లేదని ఆరోపించారు. హస్తం పార్టీ హయాంలో కరెంట్ కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్ చేసే పరిస్థితి ఉండేదని.. 3 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో విద్యుత్, తాగు, సాగు నీరు అవరోధాలు లేకుండా వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు.
Minister KTR Tour in Ramagundam : కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం: కేటీఆర్
KTR Comments on Congress : కాంగ్రెస్ పార్టీ (Congress) వారెంటీ అయిపోయి వందేళ్లు అయిందని కేటీఆర్ విమర్శించారు. వారెంటీ లేని పార్టీ గ్యారెంటీలు ఇస్తుందని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ హయాంలో రూ.200 పింఛను ఇవ్వలేకపోయారని.. కానీ ఇప్పుడేమో వారు రూ.2000 పింఛను ఇస్తామని అంటున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. వారి హయాంలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు ఉండేవని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారని.. ఒకవేళ హస్తం పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని కేటీఆర్ ఆరోపించారు. సూర్యాపేట లక్ష్మి టాకీస్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పుల్లారెడ్డి చెరువు అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
"మాది కుటుంబపాలన అని మోదీ విమర్శిస్తున్నారు. మాది కుటుంబపాలనే.. రైతులే మా కుటుంబం. దళితబంధు ఇచ్చి కేసీఆర్ దళితులకు అండగా నిలబడ్డారు. తెలంగాణ ప్రజల వసుధైక కుటుంబానికి కేసీఆరే పెద్ద దిక్కు. కొందరు మా పాలనను వారసత్వ పాలన అని విమర్శిస్తున్నారు. రుద్రమదేవి, భాగ్యరెడ్డి వర్మ, కుమురం భీం వారసత్వం మాది. మాది గాంధీ వారసత్వం అయితే.. బీజేపీది గాడ్సే వారసత్వం. కాంగ్రెస్ ముసలి నక్క. కాంగ్రెస్‌ను నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్లే." - కేటీఆర్, మంత్రి
KTR Reaction on TDP Protest in Telangana : ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలోనే తేల్చుకోవాలి: కేటీఆర్