KCR Speech in Suryapet Meeting Today : సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ బిల్డింగ్‌ను జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మాట్లాడిన సీఎం... తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. సూర్యాపేట జిల్లాలో రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంత అద్భుత కలెక్టరేట్లు, పోలీస్ భవనాలు దేశంలో ఎక్కడాలేవవి పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు సైతం లేవని వ్యాఖ్యానించారు.
మానవాభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. అలాగే తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. అలాగే సమాజంలో ఆర్ధిక, సాంఘిక అసమానతలు పోవాలని కేసీఆర్ సూచించారు. అలాగే జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ అంజనీ కుమార్‌తో ప్రారంభించారు. జిల్లా ఎస్పీని దగ్గరుండి కుర్చీలో కూర్చోబెట్టారు. అంతకు ముందు జిల్లా వైద్య కళాశాలను సీఎం ప్రారంభించారు.
"సూర్యాపేట చాలాబాగా అభివృద్ధి చెందింది. రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నాం. మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇంత అద్భుత కలెక్టరేట్లు, పోలీస్ భవనాలు ఎక్కడా లేవు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మన కలెక్టరేట్ల వలే లేవు". కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
KCR on Suryapet SP Office Inauguration : అక్కడ విద్యార్థులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అలాగే జిల్లాలో నూతనంగా నిర్మించిన మార్కెట్‌యార్డ్‌ను కేసీఆర్ ప్రారంభించారు. నాయకులతో కలిసి కలియ తిరిగి చిరు వ్యాపారస్థులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. అక్కడ జిల్లా నాయకులతో కలిసి తాజా రాజకీయ అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమాలు అనంతరం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో (Pragathi Nivedhana Sabha) కేసీఆర్ ప్రసంగిస్తారు.
KCR Speech in Suryapet Meeting : కేసీఆర్ పర్యటన దృష్ట్యా అధికారులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సుమారు 3వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై (Hyderabad-Vijayawada National Highway) ఆంక్షలు సైతం విధించారు.
BRS Suryapet Meeting Today : మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా సూర్యాపేట పట్టణం అంతా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నిండి గులాబీ సొగను విరజిమ్ముతోంది. చౌరస్తాలు, కూడళ్లు గులాబీ రంగుతో ముస్తాబయ్యాయి. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ పాల్గొనే తొలి సభ ఇదే కావడంతో.. మంత్రి జగదీశ్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం కార్యకర్తలు సభకు తరలివచ్చారు. సుమారు రెండు లక్షల మంది కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు సభకు హాజరైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TNGO and TGO leaders meet kcr : "వేతన సవరణపై.. త్వరలోనే కేసీఆర్ సానుకూల ప్రకటన"