ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలంతా సంఘీభావం తెలిపారు. ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న వారికి, బాధితులకు వైద్యం అందిస్తున్న వారందరి సేవలను కొనియాడుతూ.. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.
తమ ప్రాణాలను లెక్కచేయకుండా కరోనా నివారణకు కృషి చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సెల్యూట్ చేశారు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి రహదారులపై తిరుగుతున్న వాహనదారులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. వైరస్ను కట్టడి చేసేందుకు నిర్వహించిన జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రత పౌరుడు చప్పట్ల ద్వారా వైద్యులను కొనియాడారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు