సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శించెర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెరాస హయాంలో... గ్రామాల అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో నిర్మిస్తున్న "రైతువేదిక" నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్మినారాయణ, పంచాయతీరాజ్ ఏఈ, సర్పంచ్ మాగంటి మాధవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే - సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలం దిర్శించెర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.