సూర్యాపేట జిల్లాలో అడవుల పెంపకానికి హుజూర్నగర్ నియోజకవర్గమే అనుకూలమైనదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో చాలావరకు అటవీభూములు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు.
ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు పార్టీలకతీతెగా కలిసిపోరాడాలని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు చూస్తే ఎవ్వరినీ ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు.