ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని నిజాయితీపరులను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ, పురపాలక శాఖ సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ఓటరు చైతన్య సదస్సుకు ఆయన హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు విధిగా ఓటేయాలన్నారు. ఓటు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని విద్యార్థులకు సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి పేర్కొన్నారు. ఓటు వేసే విధానంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు, ఇరుగు పొరుగు వారికి ఓటు వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి: నేటి నుంచి దావోస్లో కేటీఆర్ పర్యటన