సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమి ఐదుసార్లు కంపించినట్లు తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై 2.1 గా నమోదైనట్లు వివరించారు. నాలుగు సెకన్ల పాటు భూమి కంపించిందని ఆయన వెల్లడించారు.
తెల్లవారుజామున మూడు నుంచి 5 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఫలితంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల జిల్లాలోని కృష్ణా పరివాహాక ప్రాంతంలో ప్రకంపనలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే ఎన్జీఆర్ఐ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి.. భూకంప లేఖని యంత్రం ఏర్పాటు చేశారు.