సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రశాంతి ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి సీజ్ చేశారు. ఓ ఆర్ఎంపీ వైద్యుడు... రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో ఆసుపత్రిని తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారు. రికార్డులు పరిశీలించి వైద్యశాలను మూసివేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి నిరంజన్ తెలిపారు.
పట్టణంలోని హుజూర్నగర్ రోడ్లో ఉన్న ప్రశాంతి మందుల దుకాణంలో కొంత కాలంగా ప్రతి మంగళవారం చర్మవ్యాధులకు వైద్యం చేసేవారు. రెండు నెలలుగా నిపుణుడు రావడం లేదు. మెడికల్ షాప్ యజమాని సహకారంతో... స్థానిక ఆర్ఎంపీ ముఖానికి మాస్క్ కట్టుకొని రోగులను పరిశీలిస్తున్నాడు. సమాచారం అందుకున్న వైద్యాధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!