సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్రవాహనాలను, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది కాలనీలోని ప్రతి ఇంటిని సోదా చేశారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి తమ బ్యాంకు వివరాలు ఇవ్వాలని కోరితే 100 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఏటీఎం పిన్ నెంబర్‌ను ఎవరికీ చెప్పొద్దని డీఎస్పీ రఘు తెలిపారు. రోజురోజుకీ సైబర్ నేరాలు, లైంగిక దాడులు, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఆరాంఘర్‌లో మహిళ కిడ్నాప్ కాల్ ఫేక్