నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతుల చేస్తున్న ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, తెరాస నేతలు.. ఎందుకు మాట మార్చారని మండిపడ్డారు. ఆ చట్టాలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో ఒకలా.. దిల్లీలో మరోలో ఉంటారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాలను అమలుచేయబోమని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
కల్నల్ సంతోష్‌బాబు తల్లితండ్రులకు సత్కారం..
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ఇచ్చిన ప్రాధాన్యతే తెలుగువాడైన పింగళి వెంకయ్యకూ ఇవ్వాలని కోరారు. భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు తల్లిదండ్రులను వీహెచ్ సత్కరించారు. ఆయన దేశభక్తిని ప్రశంసించారు.
ఇవీచూడండి: ఎర్రకోటపై రైతుల జెండా