ETV Bharat / state

హుజూర్​నగర్​ పైపులైన్ పనుల్లో గందరగోళం

author img

By

Published : Apr 2, 2021, 9:31 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ప్రధాన రహదారి వెంట మంచినీటి పైపులైన్ పనులను కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఆ పైపులైన్ పనులు ఎవరు చేస్తున్నారో స్వయంగా కమిషనర్​కు కూడా తెలియకపోవడం వల్ల గందరగోళం ఏర్పడింది.

pipeline works, huzurnagar
పైపులైన్ పనులు, హుజూర్​నగర్

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ప్రధాన రహదారి వెంట మంచినీటి పైపులైన్ పనులను కౌన్సిలర్లు అడ్డుకున్నారు. పురపాలికలో అనుమతులు లేని పనులు నడుస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల పనులు కూడా నిలిపివేశారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న కమిషనర్​ నరేశ్​రెడ్డిని కౌన్సిలర్లు అడ్డుకున్నారు. పైపులైన్ పనులు ఎవరు చేస్తున్నారో తనకు కూడా తెలియదని, కౌన్సిల్ సమావేశంలో ఈ పనులను ఆమోదించలేదని చెప్పారు. అడ్డదారిలో జరుగుతున్న పనులపై కమిషనర్​కు కూడా సమాచారం లేకపోవడం వల్ల గందరగోళం ఏర్పిడింది. ఈ విషయమై ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించగా.. అది ఆన్​లైన్ టెండర్​ అని తేలడం వల్ల వివాదం సద్దుమణిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.