కల్నల్ సంతోష్‌బాబు భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నారు. సూర్యాపేటకు రోడ్డు మార్గాన కల్నల్ భార్య, పిల్లలు బయలుదేరారు. సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పొందారు. అమరవీరుడైన సంతోష్‌బాబు పార్థీవదేహం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కల్నల్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది క్రిమిసంహారిణి మందులతో పిచికారీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..