CM KCR Districts tour : సీఎం కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించింది. ముందుగా ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్.. నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని (Medak Collectorate Office Inauguration) ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయాన్ని సైతం ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
Rythu Runamafi Telangana 2023 : వచ్చే నెల రెండో వారంలోపు రుణమాఫీ చెల్లింపులు పూర్తి..!
Suryapet Collectorate Office Inaugurate : 20వ తేదీన సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం.. అక్కడ కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభించనున్నారు. అలాగే ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
BRS on Telangana Assembly Elections : అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం ఉండటంతో తాజా పర్యటన బీఆర్ఎస్కు మంచి అవకాశంగా కనిపిస్తోంది. పర్యటనలో భాగంగా ఉమ్మడి మెదక్, నల్గొండ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం. స్థానికంగా నెలకొన్న సమస్యలు, పార్టీ నేతల మధ్య నడుస్తోన్న వర్గపోరు ఇలా అనేక అంశాలను స్థానిక నేతలతో కలిసి చర్చిస్తారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా తయారు చేసే పనిలో నిమగ్నమైన బీఆర్ఎస్.. తాజా పర్యటనలో స్థానిక కార్యకర్తలతో కలిసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.
Maharashtra Leaders Joins BRS : 'మహారాష్ట్రలో అధికారంలోకి వస్తాం..30 రోజుల్లో మార్పు చూపిస్తాం'
మరోవైపు.. పర్యటనల్లో భాగంగా సీఎం కేసీఆర్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరద నష్టంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పరిహారం వివరాలు మీటింగ్లో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, వీఆర్ఏ క్రమబద్ధీకరణ అనేక అంశాలు బహిరంగ సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇటీవల కేబినెట్ మీటింగ్లో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు వివరించనున్నారు. సంక్షేమ పథకాలకు ఎంత మొత్తంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది, రైతు రుణమాఫీ, గృహలక్ష్మి నిధుల మంజూరు ఇలా అనేక అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మరోవైపు బహిరంగ సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
CM KCR on Orphans : అనాథలకు అండగా కేసీఆర్ సర్కార్ .. 21 ఏళ్ల వరకు సంరక్షణ బాధ్యత