సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఉత్సాహంగా జరుగుతోంది. మూడో రోజు వేడుకల్లో భాగంగా చంద్రపట్నం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దేవతా విగ్రహాలున్న దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు నిర్వహించాక... పసుపు, కుంకుమలతో చంద్రపట్నం కార్యక్రమం చేపట్టారు. లింగమంతుల స్వామికి... పార్వతీదేవి రూపంలో కొలువైన మాణిక్యమ్మకు కల్యాణం జరిపించడమే చంద్రపట్నం వేడుక ప్రత్యేకత.
ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు... పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మరోవైపు పెద్దఎత్తున నిధులు ఖర్చుపెట్టినా...ఏర్పాట్లు పూర్తి స్థాయిలో లేవని... భక్తులు వాపోయారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నా... రాత్రి సమయంలో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. గుట్ట సమీప ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర... వాహనాలు నిదానంగా సాగాయి.
ఇదీ చూడండి : ఓలింగ నామస్మరణలతో మార్మోగుతున్న పెద్దగట్టు