సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో అఖిల పక్షం నాయకులు, రైతు సంఘాల నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నీటి నిల్వను మరో ఐదు టీఎంసీలు పెంచేలా నిర్ణయిస్తూ.. చేసిన 203 జీవోను రద్దు చేయాలని పట్టణంలోని ఇందిరా భవన్లో నిరసన దీక్ష చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యల వల్ల తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారుతాయని, సీఎం కేసీఆర్ మౌనం వీడి ఈ అంశంపై స్పందించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎడారిగా మారితే.. సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.