సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో ఏడాది నుంచి ఉపాధి హామీ కూలీలను మోసం చేస్తూ 70 మంది కూలీల దగ్గర రూ. 2 లక్షల 50 వేల నగదును బ్రాంచ్ పోస్టు మాస్టర్ కాజేశాడు. అతనిపై కథనాన్ని నిన్న ఈటీవీ భారత్లో రాగా స్పందించిన అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈటీవీ భారత్ వల్ల తమకు న్యాయం జరిగిందంటూ సదరు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న ప్రతి సమస్యను మీడియాలో రాకముందే పరిష్కరించాలని గ్రామపెద్దలు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండిః వృద్ధిపై అనుమానాలు... నష్టాల్లో సూచీలు