సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సైదులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సైదులు మరణానికి లైన్ మెన్ నిర్లక్ష్యమే కారణమంటూ.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. విద్యుత్ ఉపకేంద్రం ముందు మృతదేహంతో బైఠాయించారు. సైదులు కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు