సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన యువతి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు యువకుడిపై కేసు పెట్టింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.
ఇదీ చూడండి: ఫోన్ చేసి ఆమ్లెట్ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు