సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి వెళ్లిన ఆమె పత్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశానని సుజాత అన్నారు. హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో దుబ్బాకను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 10 నుంచి ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 16 వరకు గడువు ఉంది. 17న నామినేషన్లు పరిశీలించనుండగా.. 19 వరకు ఉపసంహరణకు గడువు ఉందని ఈసీ పేర్కొంది. నవంబర్ 3 పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్