ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పోషణకు ఇబ్బందిపడుతున్న ఓ గిరిజన కుటుంబాన్ని గుర్తించిన తండా వాసులు తమకు తోచిన సాయం చేసి ఆదుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాకు చెందిన గుగులోతు రామన్న నాయక్ మేస్త్రి పని చేసేవాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్‌కు గురైన రామన్న.. కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ పెద్ద యాక్సిడెంట్‌కు గురి కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అధికమై పోషణ భారమైంది. బాధిత కుటుంబానికి అండగా... చాపగాని తండా వాసులు దాదాపు రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామస్థుల సహాయానికి రామన్న నాయక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కుటుంబ పెద్దకు ప్రమాదం.. అండగా నిలిచిన తండావాసులు - గిరిజన కుటుంబానికి అండగా సాయం
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో ఓ కుటుంబానికి తండా వాసులు అండగా నిలిచారు. తమవంతు సాయంగా రూ. 25 ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.