ETV Bharat / state

అప్పులతో రైతు ఆత్మహత్య.. రోడ్డున పడ్డ కుటుంబీకులు - Doultabad in Siddipeta District Latest News

సొంత భూమి లేక.. తెచ్చిన అప్పులు తీరక.. గ్రామంలో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతుకు నష్టాలే మిగిలాయి. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం పెద్ద దిక్కు.. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​లో ఘటన చోటు చేసుకుంది.

ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి : బాధిత కుటుంబం

author img

By

Published : Jun 3, 2020, 10:32 PM IST

పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్​లో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన సంద సత్యం ఆరు ఎకరాల్లో వ్యవసాయ చేస్తుండేవాడు. భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు.

సొంత భూమి లేకపోవడం వల్లే..

సొంత భూమి లేకపోవడం వల్ల పొలం కౌలుకు తీసుకుని పెట్టుబడి సమకూర్చుకున్నాడు. ఈ క్రమంలో పంట సాగు చేయగా నష్టాలనే మిగిల్చింది. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక కౌలు రైతు సత్యం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి : బాధిత కుటుంబం

చందాలతోనే అంత్యక్రియలు !

అంత్యక్రియలకు డబ్బులు కూడా లేకపోవడం మూలానా గ్రామంలోని ప్రజలంతా చందాలు వేసుకుని గ్రామంలోని కుంటలో దహన సంస్కారాలు నిర్వహించారు. సత్యం మృతితో అతని భార్య ఇద్దరు కూతుర్లు.. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయారు.

రూ.రెండు లక్షల 50 వేలు అప్పులే..

ఆదుకునేవారు లేక ఉండటానికి సరైన ఇల్లు లేక, చేసుకునేందుకు ఉపాధి లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. రెండు లక్షల 50 వేల రూపాయలు అప్పులే అయ్యాయని... ఈ క్రమంలో భర్తను కోల్పోవడం ఆమెకు గుది బండగా మారింది. ఇద్దరు ఆడపిల్లలతో బతుకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వమే మాకు దిక్కు..

ప్రభుత్వమే తమను ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంది. అప్పుల కారణంగానే తమ తండ్రి చనిపోయాడని.. నాన్న మృతితో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మృతుడి కుమార్తె ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, మానవతావాదులు సహాయం చేయాలని.. బాగా చదువుకుంటూ తమ తల్లికి సహాయంగా ఉంటామని అర్థించారు.

ఇవీ చూడండి : 'మీరు ఎన్ని తప్పులు చేసినా... మీ మీద కరోనా కేసులు లేవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.