సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్లోని రామలింగారెడ్డి కుటుంబీకుల్ని స్పీకర్ సహా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఓదార్చారు.
అనంతరం సోలిపేట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి వారికి మనోధైర్యం అందించారు.
ఇవీ చూడండి : గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం.. జలదిగ్బంధంలో దేవీపట్నం