సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన గంధపు శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నాడు. లాక్డౌన్ కారణంగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంటి నుంచి పని చేసుకోవడానికి అవకాశమిచ్చాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ కుటుంబ కార్డుపై కేశవాపూర్‌లో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నాడు. శరీరం, మనసు ఉత్సాహంగా ఉండటానికి ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నానని ఆయన తెలిపాడు.
ఇదీ చూడండి : విద్యారంగానికి కరోనా- పరీక్షల నిర్వహణపై అయోమయం!