సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్టీసీ కార్మికులు ఈ రోజు విధుల్లో చేరారు. కండక్టర్లు, డ్రైవర్లు యథావిధిగా వాళ్ల రూట్లలోకి బస్సులను తీసుకెళ్లారు. ఉదయాన్నే డిపోకు చేరుకొని విధులకు హాజరయ్యారు. తాత్కాలిక డ్రైవర్లు బస్సులు సరిగ్గా నడపక పోవడం వల్ల కొన్ని బస్సుల్లో సమస్యలు ఉన్నాయని, బస్సు బ్యాటరీలు చార్జింగ్ లేక స్టార్ట్ అవ్వడం లేదని తెలిపారు. టికెట్ మిషన్లు కూడా సరిగ్గా పని చేయడం లేవని కండక్టర్లు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు