సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మిరుదొడ్డిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లోని విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బడిలో దాదాపు 360 మంది విద్యార్థులు చదువుతుండగా.. పక్కా పాఠశాల భవనం లేక అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు.
మూత్రశాలలూ లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటల కోసం మైదానం లేదని, స్కూల్ని పక్కనే డ్రైనేజీ కాలువ ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్ బిల్డింగ్ అనుకొని సెల్ ఫోన్ టవర్ ఉండడం వల్ల రేడియేషన్తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు పక్కా పాఠశాల భవనం నిర్మించి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: వెలుగులోకి నయా దందా... ఇదో కొత్త పెళ్లిగోల