సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. అమరవీరుల త్యాగ ఫలితంగానే నేడు సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవించగల్గుతున్నారని కలెక్టర్ తెలిపారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఇవీ చూడండి: పట్టు బిగించిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు