ETV Bharat / state

అమ్మినా.. కొన్నా జైలుకే: కలెక్టర్ వెంకట్రామిరెడ్డి - Siddipet Collector distributed Double bed room houses

సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ ఆడిటోరియంలో ఆరో విడతలో భాగంగా 192 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.

అమ్మినా.. కొన్నా జైలుకే: కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

author img

By

Published : Jan 5, 2021, 8:01 AM IST

ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను అమ్మినా... కొన్నా జైలుకు పంపిస్తామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ ఆడిటోరియంలో ఆరో విడతలో భాగంగా 192 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఇళ్లు కట్టామని, మంత్రి హరీశ్​రావు ప్రత్యేక చొరవ చూపి ఎంతో కష్టపడి అన్ని వసతులతో ఇళ్లు కట్టించారని కలెక్టర్​ గుర్తు చేశారు. ప్రభుత్వం అందించిన ఇళ్లను కాపాడుకోవాలని, ఎవరైనా అమ్మినా... కొనుగోలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో అర్హులైన వారందరికీ ఇళ్లు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఇవీ చూడండి: విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా.. పోలీసుల పటిష్ఠ నిఘా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.