ETV Bharat / state

'సిద్దిపేట జిల్లాకు త్వరలో కాళేశ్వరం నీళ్లు' - సిద్దిపేట జిల్లాకు త్వరలో కాళేశ్వరం నీళ్లు

సిద్దిపేట జిల్లాకు కొద్ది రోజుల్లోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని జిల్లా పాలనాధికారి వెంకట్రామిరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Siddipet Collector
Siddipet Collector
author img

By

Published : Jan 26, 2020, 5:43 PM IST

సిద్దిపేట జిల్లాలోని ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా నల్ల కలెక్షన్ ఇచ్చి మంచినీరు అందిస్తున్నామని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
రానున్న కొద్ది రోజుల్లోనే సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని, జిల్లాలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ నిండుకుండలా మారనుందన్నారు. సంక్షేమ పథకాలతో జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు ఎకరా భూమికి సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు.
అనంతరం పలువురు స్వాతంత్ర సమరయోధులను సన్మానించి, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, సిద్దిపేట జిల్లా సీపీ జోయల్ డేవిస్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌, అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు

ఇవీ చూడండి : రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Intro:
TG_SRD_72_26_GANATANTRA DINOTSAVAM_SCRIPT_TS10058

యాంకర్: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా పోలీస్ సి పి జోయల్ డేవిస్ జాయింట్ కలెక్టర్ పద్మాకర్ ఇతర జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.....
సంక్షేమం కార్యక్రమాలు ప్రసంగం ద్వారా జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. రానున్న కొద్ది రోజులలోనే సిద్దిపేట జిల్లాలో కాలేశ్వరం నీళ్లు వస్తాయని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ నిండుకుండలా మారబోతున్న అని ప్రశంసించారు. జిల్లాలో అనేక సంక్షేమ పథకాల ద్వారా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటింటికీ నల్ల కలెక్షన్ ఇచ్చి మంచినీరు అందిస్తున్నామని వ్యవసాయ శాఖ ద్వారా రైతు బీమా రైతు బంధు ద్వారా మరణించే వారికి ఐదు లక్షల రూపాయలు రైతుబంధు ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నామని ఇలా అభివృద్ధి పథంలో నడుస్తోంది అని అన్నారు.

Conclusion:అనంతరం జిల్లా అధికారులు ప్రవేశపెట్టిన పథకాలను శతకాల ద్వారా ప్రదర్శించారు స్వాతంత్ర సమరయోధులకు కలెక్టర్ వెంకట్రాంరెడ్డి జడ్పీ చైర్మన్ రోజా శర్మ గారిని సన్మానించారు. ప్రశంస పత్రాలు అధికారులకు అందజేశారు. విద్యార్థులు డ్యాన్సులతో ఆటపాటలతో ఆడారు చిన్న ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు వారు చేసిన నృత్యాలను తిలకించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.