siddipet girls school: సిద్దిపేట మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆహారం కలుషితమై 128 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గురుకుల పాఠశాల వార్డెన్, కిచెన్ సిబ్బంది విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురయ్యారు.
ఎన్‌ఎస్‌యూఐ నేతలు అరెస్టు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వద్ద ఎన్‌ఎస్‌యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రామునిపట్ల వద్ద బల్మూరి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్తుండగా అడ్డుకున్నారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు నిలువరించారు. పోలీసుల వైఖరికి నిరసనగా పాఠశాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు.
ఇవీ చదవండి:
Food poison in hostel: 128 మంది విద్యార్థినులకు అస్వస్థత.. మెరుగైన వైద్యం అందించాలన్న హరీశ్ రావు
'సొంతవాళ్లే మోసం చేశారు!'.. ఉద్ధవ్ తీవ్ర భావోద్వేగం.. ఇక గుడ్‌బై!!