ETV Bharat / state

కారులో పురోహితుడు.. వేదికపై వధూవరులు.. పెళ్లి ఎలా జరిగిందంటే..? - కోహెడలో పెళ్లి

కరోనా వేళ కొన్ని చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో జరుతున్న కొన్ని పెళ్లిళ్లు వైరల్​ అవుతున్నాయి. ఆన్​లైన్​ పెళ్లి, మొబైల్​ పెళ్లి అంటూ పలు వివాహాలు వార్తల్లో నిలువగా... పురోహితుని పుణ్యమా అని ఇప్పుడు ఇంకో కల్యాణం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరే చూసేయండి...!

Priest done marriage staying in car only at koheda
కారులో పంతులు.. వేదికపై వధూవరులు.. పెళ్లి ఎలా జరిగిందంటే..?
author img

By

Published : May 18, 2021, 5:40 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడలో ఆదివారం రోజు జరిగిన పెళ్లి దృశ్యాలు ఇప్పుడు వైరల్​ అవుతున్నాయి. కరోనా వేళ పెళ్లి అంటేనే జనాల్లో భయం పట్టుకుంది. ఇక పురోహితులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒక పురోహితుడు మొబైల్​ పెళ్లి చేసిన వార్త హల్​చల్​ చేయగా... ఇక్కడ పంతులు కూడా కొంచెం వెరైటీగా వివాహం జరిపాడు.

కారులో పంతులు.. వేదికపై వధూవరులు.. పెళ్లి ఎలా జరిగిందంటే..?

కోహెడకు చెందిన సటికం భాగ్య, మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో ఆదివారం జరిగింది. వధూవరులు వివాహ వేదికపై ఉంటే... పురోహితుడు ప్రసాద్ రావు శర్మ మాత్రం మండపానికి వచ్చి అదే కారులో కూర్చున్నాడు. ఆ కారులో నుంచే వధూవరులను చూస్తూ... మైక్​లో మంత్రాలు చదువుతూ వివాహం జరిపించారు. అటో ఇటో... తంతగాన్ని మొత్తం కారులో నుంచే పూర్తి చేశాడు ఆ పంతులు.

ఈ తతంగాన్ని మొత్తం అక్కడున్న వారు మొబైల్ ఫోన్​లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా సోషల్​మీడియాలో పోస్ట్ చేయగా... ఇప్పుడు ఆ పెళ్లి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కరోనా భయంతో పలుచోట్ల పురోహితులు మండపానికి దూరంగా ఉంటూ... వివాహాన్ని జరిపిస్తున్నారు.

ఇదీ చూడండి: పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.