ETV Bharat / state

కొలువుదీరిన పురపాలక నూతన పాలకవర్గాలు - తెలంగాణ తాజా వార్తలు

మినీ పురపోరులో భాగంగా జరిగిన ఐదు పురపాలికల పాలకవర్గాల ప్రమాణస్వీకారం, ఛైర్మన్‌, వైస్​ఛైర్మన్‌ల ఎన్నిక క్రతువు ముగిసింది. కొవిడ్ కారణంగా అచ్చంపేటలో నలుగురు, కొత్తూరులో ఒకరు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు. వీరితో వీడియోకాల్‌ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు.

municipal polls in telangana
పురపాలక నూతన పాలకవర్గాలు
author img

By

Published : May 7, 2021, 10:29 PM IST

పురపాలక నూతన పాలకవర్గాలు

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ, సిద్ధిపేట, నకిరేకల్​ పాలక వర్గాల ప్రమాణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

జడ్చర్ల..

బాదేపల్లి మున్సిపల్ కార్యాలయంలో జడ్చర్ల మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డితో కలిసి 23 మంది తెరాస కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 8వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన దోరెపల్లి లక్ష్మిని, 15వ వార్డు నుంచి గెలిచిన సారికను వైస్​ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అచ్చంపేట..

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెరాస నుంచి గెలిచిన కౌన్సిలర్ల ప్రమాణోత్సవానికి హాజరయ్యారు. ఛైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వ్ కాగా 16 వార్డు నుంచి గెలుపొందిన ఎడ్ల నర్సింహగౌడ్​ను, వైస్​ఛైర్మన్​గా 19వ వార్డు నుంచి గెలుపొందిన శైలజారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కొత్తూరు..

కొత్తూరు ఛైర్‌పర్సన్‌గా లావణ్య, వైస్​ఛైర్మన్​గా డోలీ రవీందర్‌ను ఎన్నుకున్నారు. మంత్రులు శ్రీనివాస్​గౌడ్, తలసాని శ్రీనివాస్​యాదవ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​తోపాటూ.. ఎక్స్​అఫిషియో సభ్యులుగా సత్యవతి రాఠోడ్​, బస్వరాజు సారయ్య, సురభి వాణీదేవీ హాజరయ్యారు.

సిద్దిపేట..

సిద్దిపేట మున్సిపల్ ఛైర్​పర్సన్‌గా కడవేర్గు మంజుల, వైస్​ఛైర్మన్​గా కనకరాజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి ఎన్నికలో మంత్రి హరీశ్​రావు, ఎంపీ ప్రభాకర్​రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో హాజరయ్యారు. ఎన్నిక క్రతువు సజావుగా ముగిసేలా పర్యవేక్షించారు.

నకిరేకల్..

నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్​గా రాచకొండ శ్రీను, వైస్​ ఛైర్​పర్సన్​గా... మురారిశెట్టి ఉమారాణి ఖరారు కాగా.. ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎంపీ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ బాలసాని.. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో ఎక్స్​అఫిషియో ఓటు హక్కు వినియోగించడంతో నకిరేకల్​లో వారి ఓటును అధికారులు తిరస్కరించారు.

కోవిడ్ నిబంధనలకు లోబడి సభ్యులందరి చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నెగటివ్ నిర్ధారణ పత్రం ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. కొవిడ్​ సోకిన వారు వీడియో కాల్‌ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇవీచూడండి: సజావుగా ముగిసిన పురపాలక పరోక్ష ఎన్నికల ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.