లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియులు మద్యం కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని రాజిరెడ్డి అనే వ్యక్తి వద్ద ఆబ్కారీ అధికారులు భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
మండలంలో నాటుసారా తయారీ జరుగుతోందన్న సమాచారం మేరకు గ్రామాలలో సోదాలు చేయగా.. పోతారంలో 20 క్వింటాళ్ళ నల్ల బెల్లం డంపు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. బెల్లాన్ని స్వాధీనం చేసుకుని రాజి రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం