సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, కేవలం హామీలు ఇస్తూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని విమర్శించారు.
కేంద్రప్రభుత్వ నిధులతోనే పట్టణాలు అభివృద్ధి జరుగుతున్నాయని వెల్లడించారు. పుర ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. హుస్నాబాద్ ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'