ETV Bharat / state

మిల్లర్ల జాప్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి మౌనదీక్ష - farmers protest

హుస్నాబాద్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రైతు విమోచన కమిటీ సభ్యులు పరిశీలించారు. ధాన్యం అన్​లోడింగ్​ విషయంలో రైస్​ మిల్లర్ల జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలతో కలిసి మౌనదీక్ష చేశారు. మిల్లర్ల నిర్లక్ష్యాన్ని ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

mouna deeksha at paddy purchase center in siddipet district
మిల్లర్ల జాప్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి మౌనదీక్ష
author img

By

Published : Apr 30, 2020, 10:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ సభ్యులు కవ్వ లక్ష్మారెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చి పక్షం రోజులుగా పడిగాపులు కాస్తున్నామని రైతులు తెలిపారని లక్ష్మారెడ్డి అన్నారు.ఈ విషయాన్ని తాను అధికారుల దృష్టికి తీసుకువెళితే వారు రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా అన్​లోడింగ్ చేసుకోవడం లేదని తెలిపారన్నారు.

ఈ విషయమై రైస్ మిల్లర్లను అడిగితే కారణమేంటో సరిగ్గా చెప్పడం లేదని, మానవతా దృష్టితో రైతులను ఇబ్బంది పెట్టకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్​లోడింగ్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. ధాన్యం అన్​లోడింగ్ విషయంలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని వెంటనే ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు. రైస్ మిల్లుల వద్ద రెండు మూడు రోజులుగా ధాన్యం లోడ్ వాహనాలతో పడిగాపులు కాస్తున్నా... అన్​లోడ్ చేసుకోవడం లేదంటూ ఓవైపు డ్రైవర్లు వాపోతున్నారు.

ఇవీ చూడండి: మే 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.