సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, జాజిరెడ్డిగూడె నాగారం మండాలల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని నాగారం మండలం ఫణిగిరి, వర్ధమానకోట మండలాల్లో రైతు వేదికలతో పాటు… జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో రూ.12.6 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. జాజిరెడ్డిగూడెలో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
రాష్ట్ర మహిళా శిశు,వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రూ.3 లక్షల చెక్కలను అందజేశారు. అనంతరం నాగారం మండలం ఫణిగిరిలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను పరామర్శించి వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ ఎంపీపీ మన్నె రేవతి, ఆయా మండలాల సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాజ్భవన్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం