సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పరివేద గ్రామంలో మిషన్ భగీరథ నీరు ఉవ్వెత్తున ఎగిసి పడింది. పైప్లైన్ పగలడం వల్ల ఫౌంటెన్ను తలపించింది. అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక చోట తరచుగా లీకేజీ అవుతూ మంచి నీరు వృథాగా పోతుంది.
నీరు విరజిమ్ముతూ ఫౌంటెన్ను తలపించడం వల్ల అటువైపుగా వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు దిగారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు... నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు.
ఇదీ చదవండి: చలిమంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం