సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో భాజపా మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం పర్యటించారు. శ్రీరాములపల్లికి వెళ్లే రహదారి మలుపులో.. పైకప్పులు లేకుండా ప్రమాదకరంగా మారిన మిషన్ భగీరథ గేట్వాల్ కుండీలను పరిశీలించారు.
ఇప్పటికే పలుమార్లు వాహనదారులు కుండీలో పడి ప్రమాదానికి గురయ్యారని వెంకటేశం తెలిపారు. ఇలాగే ఆదమరిస్తే ప్రజల ప్రాణాలకే ప్రమాదమన్నారు. తక్షణమే వాటిపై మూతలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.