సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందించారు. పేదోడి ఇంటి కల నిజం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారని మంత్రి అన్నారు.
ప్రతి ఒక్కరూ ఇళ్లు, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గృహాల వద్ద సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా, కరెంటు కల్పించామన్నారు. ఇంటిముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామని.. వీటన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
ఇవీ చూడండి: ఈనెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం