ETV Bharat / state

కల సాకారమైన వేళ.. కళ్లలో ఆనంద బాష్పాలు

దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు సిద్దిపేట నేలపై పరుగులు తీశాయి. కాలువల్లో నీరు పారే స్వప్నం సాకారమైంది. రంగనాయక సాగర్‌ ప్రధాన కాలువల ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు తీస్తుంటే అన్నదాతలు మురిసిపోయారు. ఈ అద్భుత ఘట్టం శనివారం సిద్దిపేట జిల్లాలో ఆవిష్కృతమైంది.

minister harish rao started ranganayaka sagar main canal
కాల్వలో గోదారి పరుగులు.. కళ్లలో ఆనంద బాష్పాలు
author img

By

Published : May 3, 2020, 6:56 AM IST

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో నిర్మించిన రంగనాయక సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాలువల్లోకి శనివారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ఫలితంగా జలాశయం నుంచి గోదారమ్మ ఉరకలెత్తింది. ఎడమ ప్రధాన కాలువలోకి హరీశ్‌ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పాలు చల్లి పూజలు జరిపారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర కుడి ప్రధాన కాలువను పైప్‌లైన్‌ పద్ధతిలో నిర్మించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లి, మిట్టపల్లి వద్ద ప్రత్యేక వ్యవస్థ ద్వారా పైప్‌ల నుంచి నీటిని బహిరంగ కాలువలోకి మంత్రి నీటిని వదిలారు. సిద్దిపేట నియోజకవర్గంలోని కాల్వల ద్వారా నీరు ప్రవహించడం వల్ల హరీశ్‌రావు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు.

ఇదిలా ఉండగా.. రంగనాయకసాగర్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్యాకేజీ -12 (మల్లన్నసాగర్‌) కాలువలోకి గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరాం వదిలారు. ప్రయోగ పరిశీలన కోసం విడుదల చేసిన ఈ జలం తొగుట మండలం తుక్కాపూర్‌లోని సొరంగంలో ఉన్న మల్లన్నసాగర్‌ సర్జిపూల్‌ను చేరింది. రంగనాయకసాగర్‌ నీటి మట్టం ఒక టీఎంసీకి చేరడం వల్ల జలకళ మరింతగా పెరిగింది.

కాలంతో నిమిత్తం లేకుండా సాగు..

గోదారమ్మ.. కాలువల వెంబడి బిరబిరా పరుగులు తీస్తుంటే అన్నదాతల కళ్లల్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాల్వలకు నీరు విడుదల చేసిన అనంతరం.. ఈరోజు కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇది కలా.. నిజమా? అన్నట్లుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో కరవు అనే పదం నిఘంటువు నుంచి తొలగిపోనుందని చెప్పారు.

తెలంగాణలో ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడదనుందన్నారు. విద్యుత్తు సరఫరా, కాలంతో నిమిత్తం లేకుండా సాగు చేసే రోజులు వచ్చాయన్నారు. ఇక నుంచి కాలిపోయే మోటార్లు, నియంత్రికలు కనిపించవన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇంజినీర్లు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.

పరవశించిన ప్రజాప్రతినిధులు..

రంగనాయక సాగర్‌ ఎడమ ప్రధాన కాలువ వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుతో స్వీయ చిత్రాలు దిగారు. ఎడమ కాలువలో గోదావరి జలాలను చూడగానే మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరవశించిపోయారు. వీరు కాలువలోకి దూకి ఈత కొట్టారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరాం పాల్గొన్నారు.

minister harish rao started ranganayaka sagar main canal
కాల్వలో గోదారి పరుగులు.. కళ్లలో ఆనంద బాష్పాలు

రంగనాయకసాగర్‌ జలాశయం రికార్డు కాలంలో పూర్తి..

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ తూముల నుంచి గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. పనులు ప్రారంభించిన నాలుగేళ్లలో ఆయకట్టుకు నీరు అందుబాటులోకి రావడం రికార్డుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అనంతగిరి జలాశయం కింద కొద్ది మొత్తంలోనే కొత్త ఆయకట్టు ఉండగా ఈ జలాశయం కింద భారీ విస్తీర్ణం ఉంది.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం చంద్లాపూర్‌ గ్రామంలో 2016 మే 2న రంగనాయకసాగర్‌ పనులకు అంకురార్పణ జరిగింది. 2020 మే 2న ఈ జలాశయం తూముల నుంచి నీరు పరవళ్లు తొక్కింది. జలాశయాన్ని 32.63 మీటర్ల ఎత్తుతో 8.65 కిలోమీటర్ల కట్టతో నిర్మించారు. కుడి, ఎడమ తూములు, కాలువలను పూర్తిచేశారు. మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ జలాశయం కింద 1.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కుడి కాలువ కింద 40 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద 70 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.

ఇదీచదవండి: వైద్య సిబ్బందిపై కేటీఆర్​ ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.