వచ్చే నెల 1 నుంచి 9, 10 తరగతులతోసహా కళాశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ నెలాఖరు నాటికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా విద్య అధికారులు, అన్నీ మండలాల జడ్పీటీసీ, ఏంపీపీలతో సహా 2400 మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమవుతున్న పాఠశాలల్లో తప్పనిసరిగా శానిటైజేషన్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్కూళ్లు, హస్టళ్లల్లో ఉన్న వస్తువులను పరిశీలించిన తర్వాతనే వినియోగించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఉపాధి హామీ కూలీలను, పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలన్న మంత్రి.. విద్యార్థులను పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించేందుకు కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న షెడ్యూల్ మాదిరిగానే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆజ్ఞాపించారు. ఉపాధ్యాయులకు కొవిడ్ వాక్సిన్ వేయాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వాన్ని ఒప్పించి పీఆర్సీని సాధించుకుందాం: శ్రీనివాస్‌గౌడ్