ETV Bharat / state

Harish Rao Fire On Bjp: మేం పంచుతుంటే.. కేంద్రం పెంచుతోంది: హరీశ్ రావు - హరీశ్ రావు ఫైర్

Harish Rao Fire On Bjp: విపరీతంగా ధరలు పెంచుతూ కేంద్రం పేద ప్రజల ఉసురు తీసుకుంటోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. మంత్రి స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో నిర్మించిన రెండు పడక గదులు ఇళ్లను ఆయన ప్రారంభించారు.

Harish Rao Fire On Bjp
ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Apr 25, 2022, 5:33 PM IST

Harish Rao Fire On Bjp: సీఎం కేసీఆర్ పేదలకు సంక్షేమ ఫలాలు పంచుతుంటే.. కేంద్రం మాత్రం అన్ని ధరలు పెంచుకుంటూ పోతోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు, నిత్యావసరాల ధరలు పెంచి పేదల ఉసురు పోసుకుంటోదంని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సిగ్గు లేకుండా భాజపా నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. తన సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో నిర్మించిన రెండు పడక గదులు ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

తాను ఎంత ఎదిగినా గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తానని మంత్రి తెలిపారు. తోటపల్లిలో చల్మెడ ఫీడ్స్‌ రు.50 లక్షల ఆర్ధిక సహాయంతో నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ భవనాలను హరీశ్ రావు ప్రారంభించారు. అర్హులందరికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. సొంత జాగా ఉంటే మీకే నిధులు ఇస్తాం మీరే కట్టుకోవాలని మంత్రి సూచించారు.

కేంద్ర ప్రభుత్వం బావుల దగ్గర మీటర్లు పెట్టమంటది. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువుల ధరలు పెంచుతది. అయినా భాజపా నేతలు సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తుర్రు. సీఎం కేసీఆర్ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నరు. మనమేమో పంచుతుంటే.. వాళ్లు మాత్రం పెంచుకుంటూ పోతున్నరు. పేదల ఉసురు పోసుకుంటున్నరు. భాజపా ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు మాఫీ చేసిండ్రు. కానీ బీసీలు, ఎస్సీలు, కార్మికులు వారికి అసలు పట్టరు. కాంగ్రెస్ హయాంలో ఇక అందర్నీ చూసినం. గతంలో మంచినీళ్లకు ఎంత ఇబ్బంది ఉండే. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ఎవరికైతే జాగా ఉండి ఇళ్లు కట్టుకుంటారో వారికి వెంటనే నిధులు మంజూరు చేస్తాం. నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.

- హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. దీనిని భరించలేని కేంద్ర ప్రభుత్వం బాయిల దగ్గర మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తాయిలాలు ఇస్తోందన్నారు. ఆ తాయిలాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి మీటర్లు బిగించే కార్యక్రమం మొదలు పెట్టిందని ఆరోపించారు. ఏది ఏమైనా మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారని హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

ఇవీ చూడండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా లక్షల్లో ఖర్చయ్యే వైద్యసేవలు: హరీశ్ రావు

'వచ్చే ఎన్నికల్లోనైనా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా..?' కేసీఆర్​కు కిషన్​రెడ్డి సవాల్​

ప్రభుత్వ బ్యాంకులో 'స్పెషల్' ఉద్యోగాలు.. జీతం రూ.78వేల పైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.