డబుల్ బెడ్ రూం ఇల్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన ఫర్వీన్ సుల్తానాను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. సిద్దిపేటలోని 11వ వార్డులో నివసిస్తున్న ఫర్వీన్ సుల్తానాకు పట్టణంలోని కేసీఆర్ నగర్లో 29వ బ్లాకులో ఇల్లు మంజూరైంది. తమ బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో వారు మంత్రిని గురువారం రాత్రి కలిశారు.
ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని మరో లబ్ధిదారునికి ఇచ్చే ఆలోచనతో ముందుకొచ్చినట్లు వివరించి... స్థల పత్రాలను మంత్రికి తిరిగి ఇచ్చారు. ఫర్వీన్ సుల్తానా దంపతులను శాలువా, పూలమాలతో మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గణతంత్ర వేడుకల్లో... మన పొదుపు లక్ష్మి!