సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలంతా మరోసారి తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు వేస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే ప్రతిపక్ష పార్టీల నాయకులను నమ్మొద్దన్నారు. ఈ మూడేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి; మూసీ ప్రక్షాళన పర్యవేక్షణకు కమిటీ.. ఏడాది గడువు