ETV Bharat / state

ప్రమాదవశాత్తు కొండపోచమ్మ కాల్వలో పడి వ్యక్తి మృతి - కొండపోచమ్మ జలాశయం

స్నానం కోసం కొండపోచమ్మ జలాశయం కాల్వ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వెంకటాపూర్​లో చోటు చేసుకుంది.

ప్రమాదవశాత్తు కొండపోచమ్మ కాల్వలో పడి వ్యక్తి మృతి

author img

By

Published : Aug 3, 2020, 9:37 PM IST

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు ఆదివారం కూలి పనులకు వెళ్లి వచ్చాడు. స్నానం కోసం కొండపోచమ్మ జలాశయం కాల్వ వద్దకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంట్లో స్నానం చేసేందుకు నీళ్లు లేకపోవడంతో సమీపంలోనే ఉన్న కొండపోచమ్మ జలాశయం కాలువ వద్దకు వెళ్ళాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నర్సింహులు నీటిలో పడి మృతిచెందాడు.

రాత్రి ఎంత వెతికినా ఆచూకే లేదు..

స్నానం కోసం వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాపూర్ శివారులోని కొండపోచమ్మ కాలువ వంతెన వద్ద నీటిలో నర్సింహులు మృతదేహం తేలింది. విషయం తెలుసుకున్న మర్కుక్ ఎస్సై శ్రీశైలం సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. శవ పంచనామా నిమిత్తం మృత దేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఇవీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.