ETV Bharat / state

KTR Help: మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి కేటీఆర్ - Minister ktr news

రోడ్ యాక్సిడెంట్​లో గాయాలపాలైన యువకులను తన వాహన శ్రేణిలోని రెండు కార్లలో ఆసుపత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

KTR
మంత్రి కేటీఆర్
author img

By

Published : Jul 27, 2021, 4:14 AM IST

మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి కేటీఆర్

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr)... మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని వైద్య కళాశాల సమీపంలో ద్విచక్ర వాహనం డీవైడర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు కింద పడి గాయలపాలయ్యారు. సిరిసిల్ల పర్యటన ముగించుకుని హైదరాబాద్​కు తిరిగి వెళ్తున్న మంత్రి కేటీఆర్... వీరిని గమనించి ఆగారు.

తన వాహన శ్రేణిలోని రెండు కార్లలో క్షతగాత్రులను వెంటనే సమీపంలోని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి పంపించారు. ఆసుపత్రికి తన వ్యక్తిగత సహాయకుడు మహేందర్ రెడ్డితో పాటు ఎస్కార్ట్ పోలీసులను సైతం పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఫోన్​లో సూచించారు. ప్రమాదంలో ఉన్న వారిని చూసి వెంటనే కారు ఆపి వారిని ఆసుపత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్న కేటీఆర్​కు క్షతగాత్రుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: Ramappa Temple: రామప్ప ఆలయం కాకతీయుల కళాత్మకత, అద్భుత శిల్పసంపదకు నెలవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.