ETV Bharat / state

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన - today cm kcr visit siddipet

మఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఇళ్లు లేని పేదల కోసం దేశంలోనే ఆదర్శంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లతో పాటు... సుమారు రూ. 1200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. సిద్దిపేట కేసీఆర్ స్వస్థలం కావడం వల్ల మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

KCR tour in Siddipet today 1200 crore Development programs
నేడు సిద్దిపేటలో కేసీఆర్‌ పర్యటన.. 1200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
author img

By

Published : Dec 10, 2020, 5:00 AM IST

Updated : Dec 10, 2020, 6:52 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. దాదాపు రూ.1,200 కోట్లతో చేపట్టిన వివిధ పథకాలను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరనున్న సీఎం కేసీఆర్‌... రోడ్డు మార్గంలో కొండపాక మండలం దుద్దెడకు చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న ఐటీ టవర్స్‌కు భూమిపూజ చేయనున్నారు. అనంతరం మూడు ఐటీ కంపెనీల ప్రతినిధులతో అధికారులు.. సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రంలోనే తొలిసారి నిర్మించిన తెరాస జిల్లా కార్యాలయాన్ని సిద్దిపేటలో ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 127 రైతు వేదికల నిర్మాణం చేపట్టగా.. దాదాపుగా అన్ని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మిట్టపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. స్థానిక రైతులతో కొంత సమయం గడపనున్నారు.

వెయ్యి పడకల ఆసుపత్రి

అక్కడి నుంచి సిద్దిపేట శివారులో 51,772 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత కొమటిచెరువుకు చేరుకుని.. నూతనంగా నిర్మించిన నెక్లెస్ రోడ్డుతోపాటు చెరువు సుందరీకరణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. దేశంలోనే మరెక్కడ లేని విధంగా... రూ.163 కోట్లు వెచ్చించి.. 34 ఎకరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన.. 2,460 రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాక ముఖ్యమంత్రి వారితో ముచ్చటిస్తారు. ఇళ్ల సముదాయంలో పర్యటించి సదుపాయాలను పరిశీలిస్తారు. ఆ కాలనీకి కేసీఆర్​ నగర్‌గా ఇప్పటికే నామకరణం చేశారు.

భూగర్భ నీటి పారుదల వ్యవస్థ

చింతల్ చెరువు సమీపంలో నిర్మించిన మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ను సందర్శించి... భూగర్భ నీటి పారుదల వ్యవస్థను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ చేరుకోని.. ప్రాజెక్టు మధ్యలో నిర్మించిన అతిథి గృహాన్ని జాతికి అంకితం చేస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సిద్దిపేట కేసీఆర్ స్వస్థలం కావడం వల్ల మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని.. స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌ రావు పర్యవేక్షించారు.

ఇదీ చూడండి : నన్ను ఎవరూ సంప్రదించలేదు.. అవన్నీ అవాస్తవం: జానా

Last Updated : Dec 10, 2020, 6:52 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.